Header Banner

మంచు కుటుంబంలో మళ్లీ కలహాల మంటలు! ఇంట్లోకి చొరబడిన 150 మంది? అసలేం జరిగింది!

  Wed Apr 09, 2025 10:32        Cinemas

మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారినట్టు కనిపించట్లేదు. ఆ మధ్య గొడవలు, కేసులతో మంచు వారి కుటుంబంలో కలహాలు పీక్స్ కి చేరగా.. పోలీసులు కౌన్సిలింగులతో కాస్త సబ్రేక్ పడినట్టు భావించారు. ఆ తర్వాత కేసుల వ్యవహారం కాస్త రూట్ మారి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఇన్ డైరెక్ట్ గా విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండడంతో అంతా సర్దుమనిగింది అని భావించారు. అయితే మంచు మనోజ్ - మంచు విష్ణు మధ్య వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.

 

ఇది కూడా చదవండి: బెదిరిస్తే భయపడేది కాదు.. ఇది కష్టంతో వచ్చిన ఖాకీ! జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్‍ఐ ఫైర్!



మంచు మనోజ్ మరోసారి హైదరాబాద్‌ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 150 మంది తన ఇంట్లో చొరబడ్డారని.. తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన కూతురు బర్త్‌ డే వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లగా.. విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్‌ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడంలేదన్నారు.

తాను ఇంట్లో లేనప్పుడు కారుతోపాటు కాస్ట్‌లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. జల్‌పల్లిలోని ఇంటిలోకి 150మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు. విష్ణుపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. దీంతో మంచు ఫ్యామిలీ వార్ మళ్లీ మొదలైందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇక గతేడాది నుంచి మంచు మోహన్‌బాబు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఆస్తుల వివాదం పీక్‌ స్టేజ్‌కు చేరడంతో మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్‌ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మోహన్ బాబు సైతం మంచు మనోజ్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలకు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో మనోజ్‌ ఆరోపణలపై విష్ణు ఎలా స్పందిస్తారో అని హాట్ డిస్కషన్ జరుగుతోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #ManchuFamily #ManchuManoj #ManchuVishnu #ManchuFamilyDispute #FamilyFeud #TollywoodNews